ఆ నలుగురికి గేమ్ ఛేంజర్ సినిమా ఎంతో ఇంపార్టెంట్.. సక్సెస్ పై గంపడు ఆశలు..!
రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ లో ఉన్నారు. అందుకే తన 16వ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మీద కాన్సెంట్రేట్ చేస్తున్నారు. ఇక దర్శకుడు శంకర్ కెరీర్ కి కూడా గేమ్ ఛేంజర్ విజయం ఎంతో కీలకం.. వరుస అపజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న శంకర్.. ప్రధానంగా ఇండియన్ 2 శంకర్ ఇమేజ్ను దారుణంగా డామేజ్ చేసింది.. క్లాసిక్ మూవీ భారతీయుడు సినిమాకు సిక్వల్ గా వచ్చిన ఇండియన్2 దారుణంగా ప్లాప్ అయింది. అంతకుముందు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాడు శంకర్. అందుకే గేమ్ ఛేంజర్ తో మళ్ళీ సక్సెస్ లోకి రావాలని ఎంతో కష్టపడుతున్నాడు. హీరోయిన్ కియారాకు కూడా గేమ్ ఛేంజర్ సక్సెస్ ఎంతో కీలకం.. గతంలో తెలుగు సినిమాలు చేసిన పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ..
అందుకే గేమ్ ఛెంజర్ మీదే గట్టి నమ్మకం పెట్టుకుంది కియారా అద్వానీ .. శంకర్ , రామ్ చరణ్ కాంబో మీద నేషనల్ మార్కెట్లో ఉన్న క్రేజ్ తనకు హెల్ప్ అవుతుందని ఆశలు పెట్టుకుంది. అందుకే గేమ్ ఛేంజర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు కూడా గేమ్ ఛేంజర్ విజయం కీలకం... గతంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసిన దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న అఫీషియల్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే .. అందుకే ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అన్న గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే సినిమా మేకింగ్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు ఖర్చుపెట్టిన దిల్ రాజ్.. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా అదే స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. మరి ఇలా ఇంతమంది కెరియర్ను డిసైడ్ చేయబోయే గేమ్ చేంజరే ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.