మరొకసారి అల్లు అర్జున్ పై సంచలన పోస్ట్ చేసిన పూనమ్ కౌర్ ..!
ఈ పోస్ట్ చూసిన అభిమానుల సైతం లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు.." మొత్తానికి పుష్ప-2 సినిమాను చూశానని తెలంగాణలో సమ్మక్క - సారలక్క జాతర ఎలా ఉంటుందో గంగమ్మ జాతర కూడా అలా చూపించారని.. అలాగే మన ఆచార సంస్కృతి సంప్రదాయాలను కూడా చాలా గర్వంగా చూపించారంటూ తెలపడేమే కాకుండా అల్లు అర్జున్ కంటే గొప్పగా ఎవరు నటించలేరు అంటూ పూనమ్ కౌర్ ఒక సంచలన ట్విట్ చేసింది". ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ బాగా వైరల్ గా మారుతున్నది.
మరి కొంతమంది నెటిజన్స్ అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీమ్ మొత్తం ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. పూనమ్ కౌర్ కూడా ఒకవైపు సినిమాలలో మరొకవైపు పొలిటికల్ పరంగా యాక్టివ్గానే ఉన్నది. మరి ఇలాంటి సమయంలో ఇలా పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ పైన కేసు నమోదు కావడమే కాకుండా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఈ విషయం పైన ఇటీవల అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.