అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి..?

Pandrala Sravanthi
 అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహారం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది .నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చేలా బన్నీ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ నాకు ఆమె చనిపోయిందని తెలియదని, నాకు ఎవరు ఆమె చనిపోయిందని చెప్పలేదని, అసలు నా దగ్గరికి పోలీసులు రాలేదు అంటూ చెప్పారు. కానీ ఈయన మాటలకు కౌంటర్ గా తెలంగాణ పోలీసులు ముందుగా మహిళా చనిపోయిన విషయం అల్లు అర్జున్ మేనేజర్ కి చెప్పాము.ఆ తర్వాత అల్లు అర్జున్ కి కూడా చెప్పాము. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమా చూసాకే వెళ్తాము అని అన్నాడు. మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడు అంటూ పోలీసుల కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు డబ్బు ఉంది అనే మదంతో ఆ హీరో ఈ మాటలు మాట్లాడడం, అసలు కోర్టులో కేసు నడుస్తున్న వ్యక్తి ఇలా ప్రెస్ మీట్ పెట్టవచ్చా.. 

లీగల్ గా ఇష్యూస్ వస్తాయి అని మాట్లాడే వ్యక్తి ఇలా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు.అది మాత్రం లీగల్ ఇష్యూ కాదా అంటూ పోలీసులు అల్లు అర్జున్ పై ఫైరయ్యారు.అయితే సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం శ్రీ తేజ్ చావు బతుకులతో పోరాడడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో చాలామంది మంత్రులు సినీ ఇండస్ట్రీ వారిని నిందిస్తున్నారు. అల్లుఅర్జున్ ని చూడడానికి అంత మంది వెళ్లారు. కనీసం ఒక్కరైన ఆ బాబును చూడడానికి వచ్చారా అని తిట్టిపోస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను కొందరు ఆకతాయిలు ధ్వంసం చేశారు.

టమాటాలు, కోడి గుడ్లతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు కొంతమంది ఆకతాయిలు.ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడినుండి ఆకతాయిలను తీసుకువెళ్ళిపోయారు. అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళందరూ మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అంటూ అరిచారు. అయితే వాళ్లుఓయూ జేఏసీ నాయకులు అని తెలుస్తోంది. రేవతి తరఫున పోరాడడం కోసం వాళ్లు అల్లుఅర్జున్ ఇంటి ముందు నిరసన తెలిపారు. దీంతో చనిపోయిన రేవతికి మద్దతుగా వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: