వార్నింగ్ ఇస్తూ..చర్యలు తప్పవంటున్న బన్నీ.!

FARMANULLA SHAIK
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2 సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఇందులో ఓ మహిళ మృతి చెందగా ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాబుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనపై మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా స్పందిస్తూ సీఎంకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.దీంతో వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. నా తప్పు లేకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాగే ఆ బాబు బాలేడని ఎలాంటి ఈవెంట్స్ కూడా నిర్వహించకూడని మూవీ మేకర్స్‌కు చెప్పానని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా,అల్లు అర్జున్ పై నెటిజెన్లు దుమ్ముత్తి పోస్తున్నారు.సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా భారీగా పోస్టులు పెడుతున్నారు. 

అల్లుఅర్జున్ అరెస్టేడ్ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే తాను థియేటర్ నుంచి వెళ్లిపోయానని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. 
అయితే ఆయన జాతర సీన్ వరకూ థియేటర్లోనే ఉన్నారంటూ ప్రూఫ్ లతో సహా నెటిజెన్లు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా థియేటర్ నుంచి నేరుగా వెళ్లిపోకుండా ఆయన రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు మళ్లీ చేతులు ఊపినట్లు కూడా వీడియోలను పోస్టు చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలావుండగా తాజాగా నెటిజన్స్ పై అల్లు అర్జున్ స్పందించారు. తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహారించాలని అల్లు అర్జున్ పోస్ట్ చేసారు. ఎవరినీ కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు.ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి,ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్ట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి అని కోరారు.కాగా బన్నీ అరెస్టు తర్వాత సీఎం పై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: