ప్రభాస్ సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం .. రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

Amruth kumar
బిగ్గెస్ట్ స్టార్లతో , యాక్ష‌న్ స‌న్నివేశాలతో సలార్ మూవీ యాక్ష‌న్ జోన‌ర్‌లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ మాస్ అపీరియన్స్ , పృధ్విరాజ్ సుకుమారాన్ పర్ఫామెన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ దీన్ని ఓ క‌ల్ట్ మూవీగా మార్చింది .. ఓటీటీ మాధ్యమంలో కూడా సలార్ పార్ట్ వన్ 300 రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం .. ఇది సినీ ప్రేక్షకుల మనసులో సంపాదించుకున్న స్థానం , తిరుగులేని విజయానికి తార్కానంగా నిలిచింది ..

అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ సినిమాని రిలీజ్ అయిన ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది .. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఊహించని మలుపులు తిరుగుతూ సీక్వెల్ గా సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం రాబోతుందని ఆశ్చర్యపరిచింది .. ఈ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్  బ్యానర్ పై .. విజయ్ కిరంగదూర్ సలార్‌ సినిమాని నిర్మించారు .

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్  కీలకపాత్రలో నటించగా శృతిహాసన్ జగపతిబాబు , శ్రియా రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రలో మెప్పించారు . ఇక ‘స‌లార్: పార్ట్‌1- సీజ్‌ఫైర్‌’ ఏడాది కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం షూటింగ్ త్వరలోనే మొదలు కానందుని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి .. సలార్ పార్ట్ - 2 , కల్కి- 2 సినిమాలతో పాటు ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు కూడా ఉన్నాయి .. ఇక మరి స‌లార్‌ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: