ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన నటించిన పుష్ప -2 సినిమా సంచలన రికార్డులు సాధించినా ఆ ఆనందం కనీసం అనుభవించకుండానే ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నారు. పుష్ప టు రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ ఫ్యామిలీతో సినిమాకి వచ్చింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా అదే థియేటర్లోకి సినిమాకి రావడంతో జనాల తాకిడి ఎక్కువైపోయింది. దీంతో ఆ తొక్కి సలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. ఈ ఘటనపై స్పందించినటువంటి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేసి ఒకరోజు జైల్లో పెట్టారు. దీంతో అతలాకుతమైనటువంటి తెలుగు ఇండస్ట్రీ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే సినీ ఇండస్ట్రీలోని హీరోలు ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి ఏదో జరిగినట్టు పరామర్శించారు.
అంతే కాదు ఇదంతా రేవంత్ రెడ్డే చేయించారని ఇన్ డైరెక్ట్ గా తిట్టడం మొదలుపెట్టారు. కానీ కనీసం ఎవరూ కూడా శ్రీతేజ్ కుటుంబం ఎలా ఉంది ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. దీనికి తోడు ప్రభుత్వాన్ని నిందించడంతో సీరియస్ అయినటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ని తీవ్రంగా విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ వారైనా ఎంత పెద్ద నాయకులైనా సరే చట్టం ముందు సమానులే అంటూ ఆయన మాట్లాడారు. హీరో అయితే చనిపోయిన కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారని, అనాధలైన ఆ పిల్లలకు తల్లిని తీసుకు రాగలడా ఆ వ్యక్తికి భార్యను తీసుకు రాగలరా అని ప్రశ్నించారు.. అల్లు అర్జున్ కారణంగా ఇండస్ట్రీ అంతా డిస్టర్బ్ అవుతుందని చెప్పారు. దీంతో సోషల్ మీడియా మెయిన్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై విమర్శలు వస్తున్నాయి.
ఇదే తరుణంలో ఓయూ జెఏసి నాయకులంతా అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి రాళ్లను విసిరి రచ్చ సృష్టించారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అంతేకాకుండా హైదరాబాదులో కాంగ్రెస్ నేత మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అల్లు అర్జున్ వల్ల ఒక ఫ్యామిలీ నాశనం అవ్వడమే కాకుండా సీఎంను అవమానించే విధంగా మాట్లాడారని అన్నారు. ఆయన కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారని కేటీఆర్ ను నమ్ముకుంటే బన్నీ కుటుంబం రోడ్డున పడుతుందని, అల్లు అర్జున్ మాటల వెనుక కేటీఆర్ హస్తముందని ఆయన్ని నమ్ముకుంటే ఏమీ మిగలదు అని హెచ్చరించారు. ఈ విధంగా అల్లు అర్జున్ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారింది అని చెప్పవచ్చు