అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తాను ఖండిస్తున్నానని శాంతిభద్రత విషయంలో కూడా కచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటూ తెలంగాణ రాష్ట్ర డిజిపి నగర పోలీస్ కమిషనర్ ను సైతం ఆదేశాలను జారీ చేశారు. ఈ విషయంలో మాత్రం ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారట.. అలాగే సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులకు సైతం స్పందించకుండా ఉండాలి అంటూ ఉన్నతాధికారులకు సూచన ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
అల్లు అర్జున్ ఇంటి పైన దాడి స్పందిస్తూ కొంతమంది రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయంటూ తెలియజేస్తున్నారు. పరిపాలన అసమ్మర్థతగా ఉందంటూ చాలామంది వెక్కిరిస్తున్నారు. అలాగే సోమాజిగూడలో ఏసీబీ విష్ణుమూర్తి ప్రెస్మీట్ పెట్టడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది.. ఇటీవలే సస్పెండ్ అయిన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీబీ గా కూడా పనిచేశారట.. అధికారులతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విష్ణుమూర్తి చేసిన ప్రెస్ మీట్ వాళ్ల కూడా తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ కావడంతో వీటి పైన .. డీజీపీ ఆఫీసుకు విష్ణుమూర్తి రిపోర్టు పంపించామంటూ వీటివల్ల త్వరలోనే కచ్చితంగా పోలీస్ శాఖ ఒక కఠినమైన చర్యలు తీసుకుంటుంది అంటూ తెలియజేశారట. చట్టం ముందులు అందరూ సమానమే అంటూ తెలంగాణ పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.