హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : 'హనుమాన్' తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న అమృత అయ్యర్..!!

murali krishna
“హనుమాన్” మూవీ ఫేమ్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ క్యూట్ బ్యూటీ తమిళ నాట పలు క్రేజీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది.... ఈ భామ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి బాగా పాపులర్ అయింది..ఈ బ్యూటీ ఫేస్ గుర్తున్నా పేరు మాత్రం చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో ఈ భామ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఎంతగానో అలరిస్తుంది..ఈ ఏడాది అమృత అయ్యార్ కి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాదిని ఆమె ఎప్పటికి మర్చిపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన  హనుమాన్ సినిమాలో తేజ సజ్జ సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.. తెలుగులో అసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ తో ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగింది.... ఈమె గురించి ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఈ భామ పుట్టింది తమిళనాడు లో అయినా పెరిగింది మాత్రం కర్ణాటకలో.. డిగ్రీ పూర్తి చేసిన అమృత తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది.. 

తెలుగు, తమిళ్ లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.... లింగా, తెనాలిరామన్ పొక్కిరి రాజా, తేరి వంటి చిత్రాల్లో క్రేజ్ లేని పాత్రలలో ఈ భామ నటించింది... 2021లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన “రెడ్‌” సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అనుకున్న ఫేమ్ తీసుకురాలేదు.. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో కూడా నటించింది. అయితే హనుమాన్ సినిమాతో ఈ భామ కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎండింగ్ లో అల్లరినరేష్ హీరోగా వచ్చిన “ బచ్చలమల్లి” సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.. బచ్చల మల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదలయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ తో మొదలు పెట్టిన అమృత మరో సూపర్ హిట్ తో ఈ ఏడాదిని ముగిస్తుంది…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: