అల్లు అర్జున్ కు ఇకపై ఆ ఆఫర్లు కష్టమేనా.. ఒక్క తప్పు కెరీర్ ను ముంచేసిందా?
ఇకపై బన్నీకొ కొత్త యాడ్ ఆఫర్లు రావడం సులువు కాదని జోరుగా ప్రచారం జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బన్నీని ముంచేసిందని తెలుస్తోంది. బన్నీతో సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు సైతం ఒకటికి రెండుసార్లు పునః ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. పుష్ప ది రూల్ హిట్టైనా రికార్డులు తిరగరాస్తున్నా ఆ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఈ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ వస్తే మాత్రమే పరిస్థితులు మారతాయి. జరిగింది యాక్సిడెంటల్ ఘటన అయినప్పటికీ బన్నీ పలు సందర్భాల్లో ప్రవర్తించిన తీరు ఆయనకు మైనస్ అవుతోంది. యాంటీ ఫ్యాన్స్ సైతం అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. బన్నీ ఏం చేసినా లీగల్ గా చేస్తే మంచిదని చెప్పవచ్చు.
కొన్ని వారాల పాటు బన్నీ మీడియాకు దూరంగా ఉంటే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ ఏ విషయంలోనైనా సంయమనం పాటిస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని కెరీర్ పరంగా వివాదాల్లో పడకుండా జాగ్రత్త వహించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కు రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తగిలే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.