గేమ్ ఛేంజర్ లో రాజకీయాలు !

Seetha Sailaja
రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న మూడు భారీ సినిమాలలో ‘గేమ్ ఛేంజర్’ పై చరణ్ అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘ఆచార్య’ చేదు జ్ఞాపకాలు ‘గేమ్ ఛేంజర్’ తో తొలగిపోతాయని అభిమానులు ఆశపడుతున్నారు. అంచనాలను మరింత పెంచడానికి నిర్మాత దిల్ రాజ్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించడం మరింత సంచలనంగా మారింది.

అత్యంత ఘనంగా జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజ్ కొన్ని షాక్ ఇచ్చే విషయాలు బయట పెట్టారు. దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ స్క్రిప్ట్ ను నాలుగు సంవత్సరాల క్రితమే వ్రాసుకున్నప్పటికీ అందులో వ్రాసిన కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న సంఘటనలను ఆధారంగా వ్రాశాడా అని అనిపిస్తుందని అయితే శంకర్ నాలుగు సంవత్సరాల క్రితమే తెలుగు రాష్ట్రాలలో జరిగిన సంఘటనలు ముందుగానే ఊహించాడా అన్న సందేహం ఈమూవీ చూసిన వారికి వస్తుంది అంటూ దిల్ రాజ్ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నారు.

వాస్తవానికి శంకర్ వర్తమాన పరిస్థితులను సినిమాల్లో చూపించడం కొత్త కాదు. ‘జెంటిల్ మెన్’ ‘భారతీయుడు’ ‘ప్రేమికుడు’ సినిమాలలో అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులను కథతో మిళితం చేసి సూపర్ సక్సస్ సాధించాడు. ఆతరువాత అతడు ‘రోబో’  మూవీ ఒక సంచాలానం. అయితే ఆతరువాత అతడు తీసిన సినిమాలు అన్నీ పరాజయం బాట పట్టడంతో శంకర్ నెటితరం ప్రేక్షకుల అభిరుచిని అందుకోలేక పోతున్నాడా అన్న సందేహాలు అతడి అభిమానులకు వస్తున్నాయి.

అయితే ‘గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ చాల పట్టుదలగా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఇండియన్ 2’ మూవీ ఇచ్చిన పరాభవం నుండి కోలుకుని మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈమూవీని తీశాడు అని అంటున్నారు. ఈమూవీకి బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగిన నేపధ్యంలో ‘గేమ్ ఛేంజర్’ ‘పుష్ప 2’ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్న ఆశక్తి అందరిలోను ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: