రీల్ లైఫ్ లో గెలిచి రియల్ లైఫ్ లో ఓడిన పుష్పరాజ్.. మారకపోతే కష్టమేనా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప ది రూల్ సినిమతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నార్త్, సౌత్ అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాల్లో ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించారు. అయితే పుష్పరాజ్ రీల్ లైఫ్ లో గెలిచి రియల్ లైఫ్ లో ఓడారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఈ హీరో అన్నీ నెగిటివ్ పనులే చేసినా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. నిజ జీవితంలో మాత్రం ఈ హీరో ఒక్క వివాదంలో చిక్కుకోవడం వల్ల కెరీర్ ప్రమాదంలో పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
స్టార్ హీరో అల్లు అర్జున్ ఆటిట్యూడ్, తీరు, ప్రవర్తన విషయంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అల్లు అర్జున్ తన తీరును మార్చుకోకపోతే మాత్రం కష్టమేనని చెప్పవచ్చు. స్టార్ హీరో అల్లు అర్జున్ ఘటన జరిగిన వెంటనే రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పవచ్చు. కేసు విత్ డ్రా చేసుకుంటామని చెప్పిన శ్రీతేజ్ ఫ్యామిలీ సైతం వెనక్కు తగ్గడం గమనార్హం.
 
స్టార్ హీరో అల్లు అర్జున్ ఒక విధంగా ప్రస్తుతం వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. బన్నీ విషయంలో నిజంగా కుట్ర జరుగుతోందా లేక బన్నీ చేసిన తప్పులే ప్రమాదకర స్థితిలోకి నెట్టేశాయా అనే ప్రశ్నలకు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఖండించే కొద్దీ బన్నీ కెరీర్ కు నష్టమేనని చెప్పవచ్చు.
 
కాంగ్రెస్ పార్టీతో వైరం వల్ల బన్నీ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తే మాత్రం బన్నీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఇతర పార్టీల నేతలు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం కూడా బన్నీని ముంచుతున్నాయి. సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ కు సంబంధించి వేర్వేరు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: