రష్మిక మందన్నా.. ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం 2024 లో రష్మిక నటించింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఈ ఒక్క సినిమాతోనే రష్మికకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అయితే ఈమె ఈ ఏడాది కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కేవలం పుష్ప-2 సినిమా మాత్రమే విడుదలైంది. 2025లో ఈమె నటించిన తెలుగు,తమిళ, హిందీ సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. మరి రష్మిక మందన్నాకు ఈ ఏడాది ఎలా కలిసి వచ్చింది..ఆమె చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొంతమంది హీరోయిన్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు మూడు సినిమాలతోనే హిట్టు కొడతారు. అలాంటి వారిలో రష్మిక మందన్నా కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్. అయితే రష్మిక మందన్నా నటించిన పుష్ప టు సినిమా ఈ ఏడాది విడుదలై 2024 కి మంచి సెండాఫ్ ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ప్రస్తుతం హీరో పెద్ద వివాదంలో చిక్కుకున్నప్పటికీ సినిమా మాత్రం ఎన్నో రికార్డులను కొల్లగొడుతుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా అందుకొని రికార్డులను కూడా ఈ సినిమా క్రియేట్ చేస్తోంది.అలాంటి భారీ హిట్ మూవీతో మన ముందుకు వచ్చిన రష్మిక మందన్నా చేతిలో ప్రస్తుతం ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి.ఈ ముద్దుగుమ్మ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.ఈ సినిమా టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది.
అలాగే రెయిన్ బో మూవీ, బాలీవుడ్ మూవీ అయినటువంటి థామ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక హీరోయిన్గా చేస్తున్నారు.అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే మూవీ లో కూడా రష్మిక నటిస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ఛావా అనే మూవీలో కూడా రష్మిక హీరోయిన్గా చేస్తుంది. ఇవే కాకుండా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న కుబేర మూవీ లో కూడా ధనుష్ సరసన రష్మిక హీరోయిన్గా చేస్తుంది.అలాగే 2023 లో భారీ హిట్ కొట్టిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా అనిమల్ టు మూవీలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్గా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా క్రేజ్ సినిమా సినిమాకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు.
రష్మిక మందన్నా ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు రెండు తమిళ సినిమాలు, రెండు తెలుగు సినిమాలతో ఇండస్ట్రీలోనే బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది.ఇక రష్మిక మదన్నా వరుస సినిమాలు చేస్తూ 1000 కోట్ల సినిమాల్లో భాగమవుతుంది. అలా అనిమల్, పుష్ప టు వంటి సినిమాల్లో ఈమె భాగమైన సంగతి మనకు తెలిసిందే. అలా ఈ ఏడాది పుష్ప టు మూవీ తో రష్మిక అరాచకం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు. ఇక రెమినేషన్ పరంగా చూస్తే రష్మిక పుష్ప-1 సినిమాకి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే పుష్ప టు సినిమాకి ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక హిందీ మూవీస్ కి 10 కోట్ల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.