గేమ్ ఛేంజర్ కోసం చిరు జోక్యం.. ఆ రూల్ ప్రకారం టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్!
సంక్రాంతి సినిమాల విషయంలో ఏకంగా 800 కోట్ల రూపాయల మార్కెట్ ఆధారపడి ఉంది. ఈ రేంజ్ లో కలెక్షన్లను రికవరీ చేసుకోవడం సులువైన విషయం అయితే కాదని చెప్పవచ్చు. ఆయితే గేమ్ ఛేంజర్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఆ రూల్ ప్రకారం టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించే ఛాన్స్ అయితే ఉంది. మరి చిరంజీవి ఆ దిశగా ప్రయత్నం చేస్తారేమో చూడాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయలేదు. భారీ టికెట్ రేట్లు లేకపోవడం గేమ్ ఛేంజర్ పై ఏ విధంగా ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది. దిల్ రాజు జోక్యం చేసుకుంటే ఈ పరిస్థితి కొంతమేర మారే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నైజాంలో రిలీజవుతున్న మూడు సినిమాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆయనపైనే ఎఫెక్ట్ పడనుంది. చిరంజీవి ఇండస్ట్రీలో అందరివాడుగా గుర్తింపును సంపాదించుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బన్నీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకొని భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయానికి పరిస్థితులు మారతాయేమో చూడాలి.