బన్నీని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించింది పేరు మర్చిపోయినందుకు కాదా? అందుకేనా..? తెరపైకి సంచలన ట్విస్ట్..!
ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది జనాలు ఈ విధంగా మాట్లాడుకున్నారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ని కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కారణంగా అరెస్ట్ చేయించారు అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించింది రేవంత్ రెడ్డి పర్సనల్ ఇష్యూస్ పైన కాదు అని.. కేవలం లీగల్ పరంగానే ముందుకు వెళ్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. చట్టం ఎవరికి చుట్టాలు కాదు అని ..అసలు పోలీసులు చెప్పిన కూడా అల్లు అర్జున్ అంత మూర్ఖంగా ఎలా సినిమా చూసిన తర్వాతే వెళ్తాను అంటూ మాట్లాడడం..
అదేవిధంగా రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం.. అదేవిధంగా రోడ్ షో చేయడం. ఒక మనిషి చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా థియేటర్ నుంచి వచ్చాక అలా రోడ్ షో చేస్తూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్తూ వెళ్లడం ఆయన హెడ్ వెయిట్ కి నిదర్శనమని.. ఆయన హెడ్వైట్ దించడానికి గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది అని చూపించడానికి రేవంత్ రెడ్డి ఇలా చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!