ఆ సినిమా ప్లాప్ అయితే అల్లు అర‌వింద్ బ‌తుకు బ‌స్టాండే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. ఆయన తెర వెనక శ్రీకృష్ణుడు ఎన్నో ప్రణాళికలు వేసి చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. అల్లు అరవింద్ బ్రెయిన్ మాస్టర్ బ్రెయిన్ అని అందరు పిలుస్తూ ఉంటారు .. ఆయన వ్యూహాలు ... ఆయన ప్రణాళికలు ఎవరికి అర్థం కావు. నిర్మాతగాను మంచి కథలు ఎంపిక చేసుకోవడంలో నూ అటు తన కుమారుడని స్టార్ హీరోగా తీర్చి దిద్దటంలో నూ ఆహా ఓటీటీ ని సక్సెస్ చేయడంలోనూ ఇలా అల్లు అరవింద్ ఎక్కడ చేయి వేసిన ఆయనకు తిరుగు ఉండదు. అలాంటి అల్లు అరవింద్ నిర్మాతగా తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాను నిర్మించారు. అంతకు ముందు రాంచరణ్ తొలి సినిమా చిరుత ఒక మోస్తరు గా ఆడింది. ఆ సినిమాలో చరణ్ లుక్స్ పై విపరీతమైన నెగిటివ్ కామెంట్లు పడ్డాయి.

రెండో సినిమాకే రాజమౌళి చరణ్ తో మగధీర లాంటి పెద్ద సాహసం చేశారు .. ఈ సినిమాకు ఆ రోజుల్లోనే రు . 40 కోట్లు బడ్జెట్ అయింది .. మ‌గ‌ధీర కు రు . 40 కోట్లు బడ్జెట్ అవుతుందని రాజమౌళి చెప్పిన వెంటనే అరవింద్ లో వణుకు మొదలైంది అట. కానీ రాజమౌళి తీసిన రష్ చూసి అల్లు అరవింద్ కు మాత్రం విపరీతమైన నమ్మకం వచ్చింది అట. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది .. పెట్టిన పెట్టుబడికి మూడు ఇంతులు లాభాలు వచ్చాయి. ఒకవేళ అప్పట్లో మగధీర గనక ప్లాప్ అయ్యి ఉంటే ... అల్లు అరవింద్ ఆర్థికంగా చాలా నష్టపోయేవారు అన్న ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: