షాక్: అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా టాలీవుడ్ కమెడియన్ సంచలన ట్విట్..!
అలా నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసుల పైన ఫైర్ అవుతూ ఒక ట్విట్ గతంలో చేశారు. అయితే ఇటీవలే ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ కూడా అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు.. తన తప్పు లేకున్నా కూడా తనని అనడం చాలా బాధగా ఉందని తెలుపడంతో అప్పటినుంచి కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా షేర్ చేయడమే కాకుండా కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయం పైన తాజాగా కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒక సెన్సేషనల్ ట్విట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో తనకి సపోర్టుగా మాట్లాడి ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలను సైతం వెనక్కి తీసుకుంటున్నాను అంటూ తెలిపారు. అయితే జరిగిన సంఘటన పైన తనకు చాలా తప్పుడు సమాచారం వచ్చిందని అందుకే తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ తెలియజేశారు.. అప్పుడు అల్లు అర్జున్ కి సపోర్టు చేస్తూ ఒక క్వశ్చన్ కూడా వేయడం జరిగింది రాహుల్ రామకృష్ణ.. కానీ ఇప్పుడు ఇలా సడన్గా సైడ్ మారిపోవడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పోస్ట్ ఉండటంతో నట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నది.