ఏ ఒక్క‌డి వ‌ల్ల తెలుగు సినిమా రేంజ్ పెర‌గ‌దు... ఆ క్రెడిట్ ప్రేక్ష‌కుడొక్క‌డిదే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి తెలుగు సినిమా రేంజ్ అనేది ఎల్లలు దాటేసింది. ఒకప్పుడు తెలుగు సినిమా వస్తుంది అంటే తెలుగులోనే అన్ని ప్రాంతాల్లో క్రేజ్ ఉండేది కాదు .. కొన్ని సినిమాలు కొన్ని నైజాంలో క్రేజ్ ఉంటే .. కొన్ని సినిమాలకు ఆంధ్రాలో క్రేజ్ ఉండేది .. మరికొన్ని సినిమాలకు సిడెడ్ లో క్రేజ్‌ ఉండేది. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేది. గత ఏడు ఎనిమిది సంవత్సరాలు గా తెలుగు సినిమా పరిధి పెరగటం మొదలుపెట్టింది. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది అమెరికాలో సెటిల్ కావడంతో ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు రావటం కష్టంగా ఉండేది.

అలాంటిది ఇప్పుడు కేవలం ప్రీమియర్ షో ల‌ తోనే ఒకటి నుంచి రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. ప్ర‌భాస్ న‌టించి న‌ కల్కి లాంటి సినిమాలు ఏకంగా అమెరికాలో 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మార్కెట్ అయిపోయింది. అయితే కొందరు స్టార్ హీరోలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నాం .. తెలుగు సినిమా రేంజ్ ను పెంచుతున్నాం అని గొప్పలకు పోతున్న పరిస్థితి. వాళ్ల‌కే వాళ్లే గొప్పులు చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా ఓ స్టార్ హీరో చేసిన ఈ కామెంట్లు పిచ్చ కామెడీ అనిపిస్తున్నాయి. అదంతా ఉత్తి అబద్ధం అని చెప్పాలి. వాళ్ళు తాము ఏదో స్టార్ హీరోలం తమ క్రేజ్‌ తోనే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నాం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు.

హనుమాన్ లాంటి సినిమా లో ఏ స్టార్ హీరో ఉన్నాడని .. ఏ స్టార్ హీరోయిన్ ఉందని .. ఏ స్టార్ దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేశాడని పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టింది అన్నవి అలాంటి హీరోలు మర్చిపోతున్నట్టు ఉన్నారు. ఇక్కడ అంతిమంగా కథ హీరో .. క‌థ బాగుంటేనే ఏ హీరో సినిమా అయినా చూస్తారు. నా వ‌ల్లే తెలుగు సినిమా రేంజ్ పెరిగిందంటోన్న ఆ హీరో గ‌త సినిమాలు ఎందుకు ఈ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు.. పోని త‌ర్వాత సినిమా స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతుందా ? ఈ విష‌యాన్ని ఆ హీరో చెపుతాడా ? అంటే కేవ‌లం గ‌ర్వం త‌ల‌కెక్కి అహాకారంతో మాట్లాడే మాట‌లే.. తెలుగు సినిమాకు ఈ రోజు ఈ ఖ్యాతి వ‌చ్చిందంటే హీరోల గొప్ప కాదు.. వాటిని ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల గొప్ప అన్న‌ది ఆ హీరో అర్థం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: