హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : దేవరతో మ్యాజిక్ చేసిన జాన్వీ.. అందాలతో ఆహా అనిపించిందిగా!

Reddy P Rajasekhar
2024 సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో దేవర సినిమా ముందువరసలో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. బిజినెస్ విషయంలో అదరగొట్టిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టిందని చెప్పవచ్చు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించారు.
 
జాన్వీ కపూర్ దేవర1 సినిమాలో తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా కనిపించిన ప్రతి సీన్ లో ఆకట్టుకున్నారు. దేవర సీక్వెల్ లో జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రెండు భాగాలుగా దేవర తెరకెక్కనున్న నేపథ్యంలో దేవర1 సెకండాఫ్ విషయంలో పొరపాట్లు దొర్లాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జాన్వీ కపూర్ కు మాత్రం దేవర సక్సెస్ ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ వరుసగా టాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. జాన్వీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
త్వరలో జాన్వీ కపూర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుండగా భవిష్యత్తు సినిమాలు ఆమెకు భారీ విజయాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ ఇతర భాషల్లో సత్తా చాటి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. జాన్వీ కపూర్ శ్రీదేవి స్థాయిని అందుకోవడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: