హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : కల్కితో అదరగొట్టిన దీపిక.. అలాంటి రోల్ లో నటించడం సులువు కాదుగా!
ఒక విధంగా చెప్పాలంటే దీపిక పదుకొనే తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. ఇలాంటి పాత్రల్లో నటించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో దీపిక నటన గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.
దీపికా పదుకొనే రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం దీపికా పదుకొనే పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. కల్కి సీక్వెల్ షూట్ మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కల్కి సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. కల్కి సీక్వెల్ లో సైతం యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉండనున్నాయని భోగట్టా.
దీపికా పదుకొనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీపికా పదుకొనే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీపికా పదుకొనే సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం. దీపికా పదుకొనే కెరీర్ ప్లాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇతర భాషల్లో సైతం కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సినిమా వల్ల స్టార్ హీరోయిన్ దీపికకు చాలామంది అభిమానులుగా మారిపోయారని తెలుస్తోంది.