ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది.. సంచలన వీడియో బయటపెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్?

praveen

రాష్ట్రంలో అలజడి రేపుతున్న అల్లు అర్జున్ వివాదం గురించి జనాలకు ప్రత్యేకంగా చప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య థియేటర్ వద్ద ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా భారీగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే #alluarjunarrested హాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సినిమా ప్రారంభం అయిన పాసేపటికే తాను థియేటర్ నుంచి వెళ్లిపోయానని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే.. ఆయన జాతర సీన్ వరకూ థియేటర్లోనే ఉన్నారంటూ ప్రూఫ్ లతో సహా నెటిజెన్లు వీడియోలతో సహా పోస్ట్ చేయడం కొసమెరుపు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోకు మద్దతుగా వీడియోలను పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు కూడా తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పడం గమనార్హం. దాంతోనే బన్నీ అబద్ధాలు చెబుతున్నాడంటూ నెటిజెన్లు తీవ్రస్థాయిలో దాడి చేయడంతో తాజాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ వీడియో విడుదల చేశారు. రేవతి చనిపోయిన విషయం ఉదయం 3 గంటలకు తనకు పోలీసులు చెప్పారని ఆమె భర్త గతంలో ఓ ఛానల్ తో మాట్లాడడం జరిగింది. కాగా ఇపుడు ఆ వీడియోను ఇప్పుడు బన్నీ ఫ్సాన్ వైరల్ చేస్తున్నారు.

 
అవును, అల్లు అర్జున్ రాత్రి 12 గంటలకే థియేటర్ నుంచి వెళ్లిపోయారని, ఆ తరువాత అల్లు అర్జున్ నేరుగా వెళ్లి నిద్రపోయారని.. అందుకే ఆయనకి మరుసటి రోజు ఉదయం వరకు ఈ విషయం తెలియని తెలియదని బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవతి భర్త ఫుటేజ్ షేర్ చేస్తున్నారు. 3 గంటల వరకు బాధిత మహిళ భర్తకే ఆమె చనిపోయిన విషయం తెలియనప్పుడు, 12 గంటలకు థియేటర్ నుంచి వెళ్లిపోయిన తమ హీరోకు ఎలా తెలుస్తుందని వాదిస్తున్నారు. కాగా ఈ విషయంలో ఇపుడు ఓ వర్గానికి, అల్లు అర్జున్ అభిమానులకు వార్ జరుగుతోంది. కాగా నేడో, రేపు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: