టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వారసుడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నగ్మా హీరోయిన్గా నటించింది.
ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున , నగ్మా జంటకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. నగ్మా ఈ మూవీ లో తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ మూవీ లో నాగార్జునకు తండ్రి పాత్రలో నటించాడు. నాగార్జున హీరోగా రూపొందిన సినిమాలో కృష్ణ కీలక పాత్రలో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు అనేక ఆసక్తికరమైన విషయాలు జరిగాయట. అవేమిటో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు.
ఇకపోతే వారసుడు సినిమా అనేది ఓ మూవీ కి అధికారిక రీమేక్. ఈ సినిమా యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన తర్వాత నాగార్జున , బి గోపాల్ గారిని ఈ సినిమా చేయమని సంప్రదించాడట. ఆయన అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. కానీ కచ్చితంగా ఈ సినిమాను రీమేక్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీ వీ సత్యనారాయణ ను నాగార్జున సంప్రదించగా ఆయన వారసుడు అనే టైటిల్ తో ఆ మూవీ ని రీమేక్ చేసినట్లు తెలుస్తుంది.