పుష్ప 2 క్లైమాక్స్.. థియేటర్లో అడుగుపెట్టిన రియల్ పోలీసులు .. అసలు మ్యాటర్ ఇదే..!

Amruth kumar
సినిమాలో జరిగే సీన్ రియల్ లోకి వస్తే .. ఎలా ఉంటుందో ఓ థియేటర్లో ప్రేక్షకులకు కళ్ళుకు కట్టినట్టు చూపించారు పోలీసులు .. ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రదర్శన జరుగుతుంది .. ప్రేక్షకులంతా ఎంతో ఉత్సాహంగా సినిమాను చూస్తున్నారు .. అయితే అంతులోనే అనుకోని అతిధుల్లా సినిమా హాల్లోకి పోలీసులు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు .. దాంతో అవ్వకైన ప్రేక్షకులు గుడ్లప్పగించి చూస్తూ ఉండగా.. ప్రేక్షకుల్లో సినిమా చూస్తున్న ఒకరిని పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయారు .. అరెస్టు అయిన వ్యక్తి పలు హత్య కేసుల్లో నిందితుడు , డ్రగ్స్‌ స్మగ్లర్ .. దీంతో ప్రేక్షకులు సినిమాలో మరో సినిమాలాంటి ఘటన కళ్ళ ముందు జరగడంతో అవాక్కై చూస్తూ ఉండిపోయారు . ఈ షాకింగ్ ఘ‌టన మహారాష్ట్రలోని నాగపూర్ లో గురువారం అర్ధరాత్రి ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో జరిగింది .. అసలు మ్యాటర్లోకి వెళితే.

విశాల్‌ మేశ్రామ్ .. కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్.. ఇతను గురువారం రాత్రి నాగపూర్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి పుష్ప 2 మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు .. పలు హత్య కేసుల్లో , డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాల్‌ మేశ్రామ్ .. గత పది నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు .. అయితే ఇతను రీసెంట్గా విడుదలైన పుష్పా2 సినిమాను థియేటర్లో చూస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో .. అతనిని పట్టుకోవడానికి ట్రాక్‌ చేసినట్లు పచ్‌పోలీ  పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారి ఆదివారం మీడియాకు చెప్పారు .. అలాగే ఇతనిపై రెండు మర్డర్ కేసులు , డ్రగ్ అక్రమ రవాణాతో సహా మొత్తం 27 కేసులు ఉన్నాయని .. ఇక గతంలో పోలీసులపై కూడా ప‌లుమార్లు దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇక పుష్ప2 సినిమా క్లైమాక్స్ సమయంలో పోలీసులు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి .. అప్పటికే నిందితుడు సినిమాలో ఫుల్లుగా మునిగిపోయి చూస్తున్నాడు .. అదే సమయంలో అతను చుట్టుముట్టిన పోలీసులు దగ్గరికి వచ్చి అతని తట్టేవరకు అతను ఈ లోకంలోకి రాలేదు .. వెంటనే అతను తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వెంటనే అరెస్ట్ చేశారు .. ఆ తర్వాత నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు ..విశాల్‌ మేశ్రామ్ ని త్వరలోనే నాసిక్‌లోని జైలుకు తరలించబోతున్నట్లు పోలీసులు తెలిపారు .. అరెస్టు తర్వాత సినిమా పూర్తయ్యే వరకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ప్రేక్షకులు తెలియని ఆశ్చర్యం లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: