ఒక్కరు కాదు మొత్తంగా ఐదుగురితో అంతా అయిపోయింది .. అనుష్క ఓపెన్ కామెంట్స్ వైరల్..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది .. 2005 లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది .. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించింది అనుష్క.. మొదటి సినిమా మోస్తర్ విజయ అందుకుంది .. ఆ తర్వాత విక్రమార్కుడు , అరుంధతి , బిల్లా సినిమాలతో అనుష్క స్టార్డం తెచ్చుకుంది. తెలుగులో ఉన్న  స్టార్ హీరోలు అందరితో ఆమె నటించారు .. అలాగే అటు కోలీవుడ్ లో కూడా రానించింది .. అనుష్క కెరియర్ లో బాహుబలి , బాహుబలి 2 సినిమాలు గొప్ప మైలురాయిగా  నిలిచాయి . దేవసేన పాత్రలో అనుష్క ప్రేక్షకులను మెప్పించింది .. యువరాణిగా , వృద్ధురాలిగా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించి నటనతో అదరగొట్టింది .. అలాగే బాహుబలి విజయం లో అనుష్క కూడా భాగమైంది.

ఇక అలాగే అనుష్క వివాదాలకు దూరంగా ఉంటారు .. అలాగే చిత్ర పరిశ్ర‌మ‌లో ఆమెకు మంచి పేరు ఉంది .. అలాగే ఇదే స‌మ‌యంలో అనుష్క పై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి .. ముఖ్యంగా ప్రభాస్ ని ఆమె ప్రేమిస్తుందని పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి .. బాహుబలి 2 సినిమా తర్వాత అనుష్క , ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారని వాదన బాగా వచ్చింది .. ఆ పుకార్లకు ప్రభాస్ , అనుష్క ఖండించారు. మేము కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని స్పష్టత ఇచ్చారు . అయితే గతంలో అనుష్క తన ఎఫైర్స్ రూమర్లపై ఓపెన్ గా స్పందించింది .. జయప్రద హోస్ట్గా ప్రసారమైన టాక్ షో జయప్రదంలో అనుష్క పాల్గొన్నారు .. ఆ కార్యక్రమంలో నీపై వచ్చిన అతి పెద్ద రూమర్ ఏమిటి అని అనుష్కను జయప్రద అడిగింది .. ఇక ఆ ప్రశ్నకు అనుష్క ఎటు తొడుముకోకుండా ఘాటైన సమాధానం ఇచ్చింది.

నాకు ఐదు సార్లు పెళ్లయిపోయిందని కూడా అన్నారు .. ఎవరెవరితో అని జయప్రద అడగగా.. నాతో కలిసి నటించిన కో స్టార్స్ తో ని అనుష్క సమాధానమిచ్చారు .. వారు ఎవరెవరు అని జయప్రద అడగగా.. సుమంత్ , గోపీచంద్ , ప్రభాస్ , సెంథిల్ తో పాటు మరొకరితో తనకు పెళ్ళంటూ ప్రేమలో ఉన్నానంటూ వార్తలు బయటకు వచ్చాయని అనుష్క చెప్పుకొచ్చింది. ఇలా కెరియర్ బిగినింగ్లో అనుష్క సుమంత్ , గోపీచంద్ తో కూడా కలిసిన నటించారు .. గోపీచంద్ - అనుష్క ఎఫైర్ రూమర్స్ అప్పట్లో గట్టిగా వినిపించాయి .. అలాగే పెళ్ళంటూ కూడా వార్తలు వచ్చాయి .. ఈ పుకార్లపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు .. అలాగే రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్  కుమార్ తో కూడా అనుష్క పెళ్ళిని కూడా వార్తలు వచ్చాయి .. తర్వాత సిందేల్ కుమార్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అనుష్క కూడా వెళ్ళింది. అప్పుట్లోనే అనుష్క తన ఎఫైర్ రూమర్లపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్టార్ బ్యూటీ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ అనే సినిమా చేస్తుంది .. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: