ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెక్స్ట్ 1000 కోట్లు రాబట్టే సినిమా ఏదో తెలుసా..?

frame ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెక్స్ట్ 1000 కోట్లు రాబట్టే సినిమా ఏదో తెలుసా..?

Amruth kumar
1000 కోట్లు సినిమా అంటే ఒకప్పుడు ఎంతో అద్భుతం .. కానీ ఇప్పుడు కేవలం ఆరు రోజుల్లోనే వచ్చే కలెక్షన్లు.. ఈజీగా మారిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలాని పేల్చడం .. ఇక మరి రాబోయే సినిమాల్లో ఇండియన్ చిత్ర పరిశ్రమలో 1000 కోట్లు వసూల్ చేసే సినిమా ఏది ? ఇది కూడా మళ్లీ సౌత్ సినిమాకే సాధ్యమా ? లేక బాలీవుడ్ నుంచి మేమున్నామని అంటూ ఎవరైనా పోటీ వస్తున్నారా ? ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పటికే బాలీవుడ్ లో చరిత్ర క్రియేట్ చేసింది పుష్ప2.. స్త్రీ 2 పేరు మీదున్న 600 కోట్ల రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు పుష్ప రాజ్..

ఇక ఇప్పుడు 700 కోట్లవైపు పుష్ప2 అడుగులు ఇప్పుడు పడుతున్నాయి .. ప్రస్తుతం షూటింగుల్లో ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2 కు మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది .. అందులో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్ లో వార్ 2కు కలెక్షన్లకు తిరుగు ఉండదు.. ఎలాగో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఉన్నారు కాబట్టి.. ఇప్పటికే దేవర, త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ వచ్చారు .. అందుకే తర్వాత 1000 కోట్లు సినిమా రేస్ లో వార్‌2  ముందు వరుసలో ఉంది.  వార్ 2ను మినహాయిస్తే తర్వాత 1000కోట్ల రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే.. కన్నడ నుంచి కాంతారా 2 తో పాటు.. కేజిఎఫ్ స్టార్ యాష్‌ నటిస్తున్న టాక్సిక్ కు ఆ అవకాశం ఉంది ..

అలాగే ప్రభాస్ ఫౌజికి 1000కోట్లు దానికి మించి కలెక్ట్ చేసే సత్తా కూడా ఉందని అంటున్నారు.. ఇక చివరిగా రజిని లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలి సినిమా రేసులో నేనున్నానని అంటుంది. తమిళ చిత్ర పరిశ్ర నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్లు సినిమా కూడా రాలేదు .. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్లో చేరింది .. బాలీవుడ్ లో మ్యాజిక్ చేస్తేనే కూలి అయిన 1000 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది .. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్‌ను ఈ రేసు నుంచి తొలగించలేం .. ప్రభాస్ క్రేజ్ ఫర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే మరో 1000 కోట్లు ఆయన ఖాతాలో వచ్చి పడతాయి .. మరి రాబోయే సినిమాల్లో ఏ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: