అల్లు అర్జున్ అరెస్ట్ : ఈ హీరోలకి ఇప్పటికైనా బుద్ధొచ్చిందా..?

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్థాయి లో ఎలా ట్రోళ్లింగ్ కి  గురవుతున్నాడో అందరికి తెలిసిందే.  అల్లు అర్జున్ రేవతి విషయంలో చేసింది తప్పా..? ఒప్పా..? విషయం పక్కనపెడితే ఆయన లీగల్ పరంగా చిక్కులు ఎదుర్కొంటారని తెలిసి కూడా అబద్ధాలు ఆడడం సంచలనంగా మారింది . అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి ఎంత హంగామా చేస్తూ వచ్చాడో వీడియోలో రికార్డు అయింది.


 పోలీసులు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే అల్లు అర్జున్ మాత్రం అసలు అలా ఏం జరగలేదు అంటూ కొట్టి పడేసాడు.  అంతేకాదు పోలీసులు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ పరోక్షంగా స్పందించారు.  దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు షేక్ అయిపోతుంది.  అసలు అల్లు అర్జున్ ఎందుకు అలా చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే మరొక పక్క సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా మేకర్స్ టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.

 
అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ..? తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలు ఇవ్వము..? టికెట్ రేట్లు పెంచమని చెప్పేసింది.  నెక్స్ట్ ఇండస్ట్రీ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? అనే విధంగా మాట్లాడుతున్నారు.  అయితే చాలామంది హీరోలు మాత్రం అసలు ఈ ప్రమోషన్స్ వద్దు ఈ ఫాన్స్ ఫాలోయింగ్ వద్దు అంటూ చాలా చాలా బోల్డ్ గా డెసిషన్ తీసుకుంటున్నారట . సంక్రాంతి రేసులో విశ్వంభర సినిమా ఉంది.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది అలాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారట . పక్కా సెక్యూరిటీతో అతి చేసే ఫ్యాన్స్ ని దూరంగా పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట .దీంతో ఇప్పటికైనా ఈ హీరోలకి బుద్ధొచ్చిందేమో..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: