అల్లు అర్జున్ ఎదగడం.. వారికి ఇష్టం లేదా?..అందుకే ఇలానా..?

Divya
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ జాతీయస్థాయిలో పేరు సంపాదించడంతో పుష్ప 2 సినిమాకి కూడా అంతే స్థాయిలో హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు చేశారు.. అయితే దీని వెనక చాలా కుట్ర జరిగింది అనే విధంగా అభిమానులు అయితే వాపోతున్నప్పటికీ..ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులతో కలిసి ఈ సినిమాని చూడాలని దాదాపుగా మూడేళ్లపాటు వెయిట్ చేశానని తెలిపారు. కానీ అల్లు అర్జున్ అరెస్టు చేయడమే కాకుండా బెయిల్ మీద బయటికి వచ్చారు.ఈ వ్యవహారం రోజురోజుకి రాజకీయంగా మారుతున్నది.

అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉండేసరికి అల్లు అర్జున్ ని పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి సెలబ్రిటీలు సైతం క్యూ కట్టారు.  అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా కొంతమేరకు ఆలస్యంగానే తూతూ మంత్రంగానే స్పందించడం జరిగిందట. అల్లు అర్జున్ బంధువైన డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన రోజు కూడా హైదరాబాదులోనే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి అసలు వెళ్ళలేదట.

నిజానికి ఒక తెలుగు చిత్రం పుష్ప 2 సినిమా జాతీయస్థాయిలో బ్లాక్ బాస్టర్ నిలవడంతో ఈ వేడుకలు చాలా గ్రాండ్గా జరుపుకోవాలనే సమయంలో అల్లు అర్జున్ పైన ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది అంటూ సిని వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత సంధ్య థియేటర్ ఘటన పైన స్పందించడంతో పాటుగా అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం వెనుక చాలా కథ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రెండు మూడు రోజులు జైల్లో ఉండేలా అల్లు అర్జున్ పై  ప్లాన్ చేశారని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఇలాంటి ప్లాన్ వెనుక అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ కు ముందే చాలామంది అల్లు అర్జున్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. నువ్వు మెగా కుటుంబం కిందే ఉండాలని.. నాకు ఇష్టమైతే వస్తాను లేకపోతే లేదు అన్నట్టుగా మాటలు మాట్లాడావు నువ్వు పెద్ద పుడంగిగా అంటూ చాలామంది విమర్శించారు.. కానీ ఈ విమర్శలు అన్నీ కూడా అల్లు అర్జున్ సినిమా సక్సెస్ ముందర తేలిపోయాయి. నటనతో ఒక మెట్టు పైకి ఎదిగిన అల్లు అర్జున్.. కలెక్షన్స్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. దీంతో చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ విషయం మీద రాజకీయ కుట్ర ఉందనే విధంగా తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది..? ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: