ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు..?
ఒకప్పుడు పరిశ్రమలో ఎలాంటి సమస్య ఉన్నా పెద్ద దిక్కుగా దాసరి నారాయణ రావు అన్ని సమస్యలను పరిష్కరించే వారు. పరిశ్రమలో ఎలాంటి సమస్యలు రాకుండా చూశారు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ తాను ఉండి చక్కదిద్దుతూ వచ్చారు. దాసరి కాలం చేశాక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకరిద్దరు పెద్ద దిక్కుగా ఉండే అవకాశం ఉన్నా అవసరమైన సమయాల్లో వారు స్పందించలేకపోవడంతో వాళ్లని పక్కన పెట్టారు.
పరిశ్రమ పెద్ద దిక్కు ఎవరు. ఇలాంటి సమస్య ఏదైనా వస్తే పరిశ్రమ తరపు నుంచి మాట్లాడాల్సింది ఎవరు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. కొన్నాళ్లు చిరంజీవినే పరిశ్రమ పెద్ద దిక్కు అని కొందరు చెబుతున్నా అల్లు అర్జున్ ఇష్యూలో ఆయన సైలెంట్ గా ఉన్నారని.. ముందుకొచ్చి ఆయన మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. ఐతే పరిశ్రమ పెద్ద దిక్కు అనేది దాసరితోనే ముగిసింది.