గేమ్ ఛేంజర్ : సరికొత్త స్క్రీన్ ప్లే తో శంకర్ మ్యాజిక్ చేస్తాడా..?

murali krishna
గేమ్ చేంజర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని యూఎస్ లో డల్లాస్ వేదికగా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. యూఎస్ డిస్టిబ్యూటర్ రాజేష్ ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమాకి వర్క్ చేసిన వారందరూ మేగ్జిమమ్ పాల్గొన్నారు. ఇందులో రామ్ చరణ్ స్టేజ్ పైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులని అలరించారు.ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దిల్ రాజు ఏకంగా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ కోసం కూడా అయన గట్టిగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' తెలుగు రాష్ట్రాలలో నిజమైన ఇన్సిడెంట్స్ ‘గేమ్ చేంజర్’ మూవీలో కనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు చాలా రిలేట్ అవుతాయి. మీతో క్లాప్స్ కొట్టిస్తాయి.నిజానికి అవన్నీ కూడా శంకర్ గారు నాలుగేళ్ల క్రితమే స్క్రిప్ట్ లో రాసుకున్నారు. అయితే ఆ సంఘటనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

అందుకే ఈ చిత్రం కచ్చితంగా మీ అందరికి కనెక్ట్ అవుతుంది' అని అన్నారు. హైవోల్టేజ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో చాలా ఉంటాయి. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఒక కిక్ ఇస్తుందని దిల్ రాజు గొప్పగా చెప్పారు.ఆయన మాటల బట్టి సినిమాపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్ధమవుతోంది. అలాగే శంకర్ మరల తనలోని పవర్ఫుల్ రైటర్ ని బయటకి తీసుకొచ్చి బలమైన సామాజిక అంశాలని ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాడని తెలుస్తోంది. ‘భారతీయుడు 2’తో రానటువంటి సక్సెస్ ని ‘గేమ్ చేంజర్’ తో శంకర్ అందుకునే అవకాశాలు ఉన్నాయని దిల్ రాజు మాటల బట్టి అనిపిస్తోంది.శంకర్ కూడా సాలిడ్ సక్సెస్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ మార్కెట్ ఎంత ఉందనేది కూడా డిసైడ్ అయిపోతుంది. మరి సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: