నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి టైటిల్ సాంగ్ శనివారం రిలీజైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతికి కానుగా థియేటర్లలోకి రాబోతోంది.రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇటీవల టైటిల్ రిలీజ్ చేసిన డాకు మహారాజ్ టీమ్.. ఈరోజు టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయడం ద్వారా బాలయ్య లుక్‌తో పాటు కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది. 1980లో ఛంబల్ ఏరియాలోని దోపిడీ ముఠాకి సంబంధించిన కథ ఇది.ఇదిలాఉండగా సంక్రాంతి సీజన్ నందమూరి బాలకృష్ణ కి ఎంతలా కలిసొచ్చిందో చాలా సంవత్సరాల నుండి మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆయన కెరీర్ లో సంచలనాత్మకంగా నిల్చిన చిత్రాలన్నీ ఎక్కువ శాతం సంక్రాంతికి విడుదలైనవే ఉన్నాయి.కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి కానీ, ఎక్కువ శాతం హిట్స్ ఉన్నాయి. అయితే సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు గ్లిమ్స్, టైటిల్ సాంగ్ విడుదలయ్యాయి.
ఈ రెండిటికి ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియా లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.అయితే ఈ సినిమా ఖాతాలో ఇప్పుడు ఒక చెత్త రికార్డు చేరింది. అదేమిటంటే వారం రోజుల క్రితం ‘ది రేజ్ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు కేవలం 2.6 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయట. ఒక టాప్ హీరో కి ఇంత తక్కువ వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని, బాలయ్య ఖాతాలో అలాంటి చెత్త రికార్డు చేరిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ పాటకు, ట్రైలర్ కి యూట్యూబ్ లో యాడ్స్ వేస్తున్నారు. కానీ డాకు మహారాజ్ కి అలాంటివి చేయలేదు. అందుకే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. నెల రోజుల క్రితం విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఏకంగా 13 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం బాలయ్య అభిమానుల నుండి మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ గ్లిమ్స్ వీడియో ని పొగడ్తలతో ముంచెత్తారు.అలాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ వచ్చిన తర్వాత, ఇలాంటి పూర్ రెస్పాన్స్ వచ్చిన సాంగ్ రావడం అభిమానులను నిరాశకి గురి చేసింది.