తొక్కిసలాట ఘటన..ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం.!

FARMANULLA SHAIK
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు డిసెంబర్ 22న అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు.తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. అల్లు అర్జున్ పై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సొంత ఇండస్ట్రీ నుంచి మరో భారీ షాక్ తగలడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఒక సర్కులర్ జారీ చేసింది.అందులో “.2024 డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన వర్ణనాతీతం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఈ సంఘటన ఎవరు ఊహించనిది. అయితే ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మనం అండగా నిలుద్దాం. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీకి, తల్లిని కోల్పోయిన ఆ అబ్బాయికి ఆర్థికంగా అండగా ఫిలిం ఛాంబర్ సభ్యులంతా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక ఎవరైతే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ లో సభ్యులుగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా స్టాండ్ తీసుకొని మీ వంతుగా ఆ బాలుడి కుటుంబానికి డబ్బులు డొనేట్ చేయాలని కోరుతున్నాము అంటూ ఫిలిం ఛాంబర్ అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్న సునీల్ నారంగ్ ఈ మేరకు సర్కులర్ విడుదల చేయడంతో పలువురు నెటిజెన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడి కుటుంబానికి అండగా నిలవడం కోసం ముందుకు వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: