ఆ ఒక్క ప్రశ్న బన్నీ జీవితాంతం గుర్తుంటుందంటూ సంచలన వీడియో వైరల్.!

FARMANULLA SHAIK
పుష్ప సినిమా రిలీజై ఎంతటి సంచలనం సృష్టించిందో.. ఆ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటన అంతకుమించిన సంచలనంగా మారింది.ఈ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, ఆ వెంటనే బెయిల్ రావడం, బెయిల్ వచ్చినా ఒక రోజు జైలులో గడపాల్సిరావడంతో హీరోపై సానుభూతి పెంచింది. అయితే ఈ ఎపిసోడ్ పై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత, అల్లు అర్జున ప్రతిస్పందించడం, ఆయనకు కౌంటర్ గా తెలంగాణ పోలీసులు పది నిమిషాల నిడివిగల వీడియోను రిలీజ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.అయితే ఈ ఇష్యూపై కొందరు అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు రేవంత్ వ్యాఖ్యల్ని తప్పు బడుతున్నారు. ఇందులో భాగంగానే ఓ సినీ విశ్లేషకుడు ఆ రోజు తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లుప్తంగా వివరించారు.తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది, మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోండి లాఅండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయితే మేము కాపాడలేమని పోలీసులు చెప్తే. ఈ పాట అయిపోగానే వెళ్తా, ఈ ఫిట్ అయిపోగానే వెళ్తా, నేను ఇలా మధ్యలోనే వెళ్తే నా సినిమా బాలేదని అనుకుంటారు అని అల్లు అర్జున్ బాధ్యత లేకుండా వ్యవహరించాడు. 

ఆ రోజు ఏసీపీ.. అల్లు అర్జున్ ను అడిగిన ఒక్క ప్రశ్న అతన్ని జీవితాంతం వెంటాడుతుంది.ఏం చదువుకున్నావ్, నీకు కామెన్స్ సెన్స్ ఉందా? చెప్తుంటే అర్ధం కాదా? అవతల ఓ మనిషి చనిపోయిందని చెప్తుంటే నా సినిమా అంటావ్, నా పాట అంటావ్.. అని ఆ రోజు ఏసీపీ అల్లు అర్జున్ తో అన్నాడు. అది అల్లు అర్జున్ ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఇదిలావుండగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది, సంధ్య థియేటర్ ఇష్యుపై స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చెయ్యగా కోర్టు వాళ్ళకి అరెస్ట్ అయిన కాసేపటికే బెయిల్ మంజూరు చేసింది.తన ఇంటి మీద జరిగిన దాడి విషయంలో అభిమానులు సంయనం పాటించాలని అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: