"అల్లు"డి కోసం గాంధీభవన్ కి వెళ్లి అవమానాల పాలైన బన్నీ మామ.?

Pandrala Sravanthi
ప్రస్తుతం తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది అల్లు అర్జున్ పుష్ప టు వివాదమే.. ఈ వివాదం ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లదాడి చేసే వరకు వెళ్లారు. ఆ భయంతో అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లల్ని తన మామ ఇంటికి కూడా పంపించేశారు. అయితే ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే కచ్చితంగా అల్లు అర్జున్ జైలు జీవితం గడపాల్సిందే అంటున్నారు కొంతమంది. అయితే ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఏదో ఒకటి చేసి అల్లుడిని నిర్దోషిగా బయటకు తీసుకురావాలి అని  అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈరోజు గాంధీభవన్ కి చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు కోసం వెళ్లగా అవమానాల పాలై తిరిగి ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ గాంధీభవన్లో చంద్రశేఖర్ కి ఎలాంటి అవమానం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

ఈరోజు గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి దీపదాస్ మున్షి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అయితే ఈ సమావేశం తర్వాత ఎలాగైనా దీపదాస్ మున్షిని కలవాలి అని చంద్రశేఖర్ రెడ్డి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇక విలేకరుల సమావేశం అయిపోవడంతోనే దీపదాస్ మున్షి తన ఛాంబర్ కి వెళ్లి కూర్చున్నారట.ఇక వెంటనే దొరికిందే సమయం అనుకొని చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడదామని చాంబర్లోకి వెళ్ళగా  ఆయనతో మాట్లాడడానికి నిరాకరించారట. దాంతో అవమానంగా ఫీలైన చంద్రశేఖర్ రెడ్డి తిరిగి ఛాంబర్ నుండి బయటికి వచ్చి ఇంటికి వెళ్లి పోయారట. 

అయితే ఆ ఇంటికి వెళ్లే క్రమంలో విలేకరులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రశ్నించగా ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను నేను మా నాయకుల్ని కలవడానికి వచ్చాను అంటూ చెప్పుకుంటూ వెళ్లారట. అయితే ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లుడు కోసం వెళ్లి అవమానాల పాలైన మామ అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఇక అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉండేవారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి మకాం మార్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: