అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఐపీఎస్ అధికారిని అవమానించేలా... సీన్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. ఒక స్మగ్లర్..... ఐపీఎస్ అధికారి మధ్య ఉచ్చ పోసే సీన్... పెట్టడం ఏంటని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇంతటి దారుణం ఎక్కడ చూడలేదంటూ... ఫైర్ అవుతున్నారు.
పోలీస్ అధికారులను... కించపరిచేలా... సినిమా తీసినందుకు క్షమాపణలు చెప్పాలని... తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. నువ్వు వెళ్లి అల్లు అర్జున్ ది తాగుపో... అంటూ దర్శకుడు సుకుమార్ పై నిప్పులు చెరిగారు. సిగ్గుండాలి వెధవ అంటూ... రెచ్చిపోయారు తీన్మార్ మల్లన్న. అటు దర్శకుడు సుకుమార్, అలాగే హీరో అల్లు అర్జున్ ను.... ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు తీన్మార్ మల్లన్న.
పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీసిన దర్శకుడిది ఏ ఊరు రా... అంటూ దర్శకుడు సుకుమార్ పై.. హాట్ కామెంట్స్ చేశారు. దీంతో... కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సినిమా ప్రముఖులు అలాగే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం వచ్చిన తర్వాత... తీన్మార్ మల్లన్న రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని... ఇలాంటి వారిని ఉరితీయాలంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా... నిన్నటి రోజున హీరో అల్లు అర్జున్ ఇంటిపై... ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు దాడి చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు అరెస్టు కూడా అయ్యారు. వారు ఒక రోజులోనే జైలు నుంచి బయటకు కూడా రావడం జరిగింది.
ఇక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట లో.... రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో రేవతి కొడుకు శ్రీతేజ్... కూడా గాయపడడం మనం చూసాం. ప్రస్తుతం రేవతి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె కొడుకు వైద్యానికి కావలసిన అంత ఖర్చు హీరో అల్లు అర్జున్ పెట్టడం జరుగుతోంది.