అల్లు అర్జున్ కోసం రంగంలోకి చంద్రబాబు ?
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వివాదంలో తలదూర్చి... ఈ సమస్యకు ఒక పుల్ స్టాప్ పెట్టానని చంద్రబాబు నాయుడు.. రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్... కాంగ్రెస్ అగ్ర నేతలతో మాట్లాడినప్పటికీ... దీనిపై వాళ్లు పెద్దగా రియాక్ట్ కావడం లేదట.
అయితే బిజెపి నేతలు మాత్రం అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలుస్తూ... రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. డీకే అరుణ లాంటి వారు... ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబుతో... కలిసి.. ఈ వివాదం ముగిసేలా బిజెపి ప్లాన్ వేసిందట.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు ఇద్దరు దగ్గర వ్యక్తులు కావడంతో.. నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లి అల్లు అర్జున్ తో మాట్లాడబోతున్నారట. ఆ తర్వాత ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేలా రేవంత్ రెడ్డి తో.. సమావేశం కాబోతున్నారట చంద్రబాబు నాయుడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. అయితే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యల గురించి మొదట చర్చించి ఆ తర్వాత అల్లు అర్జున్ వివాదంపై మాట్లాడబోతున్నారట.
అయితే దీంతో... అల్లు అర్జున్... చంద్రబాబు రంగంలోకి దిగాడని కొంతమంది అంటున్నారు. ఇది ఇలా ఉండగా... టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ టార్గెట్ చేసి.. చాలా కాంగ్రెస్ నేతలు... కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రేవతి కేసు లో అల్లు అర్జున్ అరెస్టయి ఒకరోజు పాటు జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే.. ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్... తాజాగా ఈ కేసులో నోటీసులు అందుకున్నారు.