వరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : ఈ సంవత్సరం తగ్గిన రవి బస్రూర్ సౌంగ్.. కారణం అదేనా..?

Pulgam Srinivas
కన్నడ సినిమా పరిశ్రమలో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ల లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రవి బస్రుర్ ఒకరు . ఈయన చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి చాలా కన్నడ సినిమాలకు సంగీతం అందించాడు . కానీ ఈయన సంగీతం అందించిన సినిమాలు అన్నీ కూడా కేవలం కన్నడ భాష లో మంచి విజయాలను సాధించడం తో ఈయనకు అక్కడ తప్పిస్తే దేశ వ్యాప్తంగా గుర్తింపు రాలేదు . కొన్ని సంవత్సరాల క్రితం యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కే జి ఎఫ్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం , ఇందులోని సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు రావడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇకపోతే పోయిన సంవత్సరం ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో కూడా ఈయన అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమాతో ఈయన పేరు పోయిన సంవత్సరం కూడా మారుమ్రోగింది.

ఇక ఈ సంవత్సరం మాత్రం ఈయన సౌండ్ చాలా వరకు తగ్గింది. ఈ సంవత్సరం ఈయన సంగీతం అందించిన సినిమాలు చాలా తక్కువ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం ఈయన సంగీతం అందించిన బైరతి రనగల్ , బార్కో సినిమాలు విడుదల అయ్యాయి. ఇలా ఈ సంవత్సరం ఈయన తన సంగీతంతో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు. మరి వచ్చే సంవత్సరం ఈయన ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: