సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బన్నీ చేసిన బిగ్ బిగ్ బిగ్ మిస్టేక్ ఇదే.. అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయాడు..!
అయితే అసలు అల్లు అర్జున్ ఎందుకు అంత పెద్ద బిగ్ మిస్టేక్ చేసాడు ..? అన్న విషయం ఇప్పుడు జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . అల్లు అర్జున్ సాధారణంగా అలాంటి తప్పు చేయరు. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మాత్రం అలాంటి బిగ్ మిస్టేక్ చేశారు అంటున్నారు జనాలు . అల్లు అర్జున్ అంతా హెడ్ వెయిట్ ప్రదర్శించకుండా ఉండాల్సింది అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక మహిళ మృతి చెందింది అని తెలుసుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ అస్సలు ఆమె గురించి రియాక్ట్ కాకపోవడం.. ఆమెను పరామర్శించకపోవడం మైనస్ గా మారింది.
అంతేకాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన సినిమా ప్రమోషన్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆయన కప్ లో గ్రీన్ టీ తాగుతున్నప్పుడు కూడా షర్ట్ పై వైల్డ్ ఫైర్ అంటూ ఉండటం అందరికి షాకింగా అనిపించింది. అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అల్లు అర్జున్ ఎక్కడ రేవతి కుటుంబం పట్ల బాధపడకుండా ఆయన తప్పు చేయలేదు అన్న విషయాన్ని హైలెట్ చేయడం మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు స్నేహారెడ్డిని హగ్ చేసుకుని కిస్ చేయడం.. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ అదే విధంగా ప్రవర్తించడం .. ఆయన రేవతి మృతిని చాలా లైట్ గా తీసుకున్నాడు అన్న విషయాన్ని బయటపెట్టింది . దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ అదే అని ఆయన ఇంకా పుష్ప రాజ్ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేకపోయాడు అని .. ఆ హెడ్ వెయిట్ తోనే ఉన్నాడు అని రేవంత్ రెడ్డి మొత్తం కూడా దించేసే విధంగా ప్లాన్ చేశాడు అని మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి అల్లు అర్జున్ అడ్డంగా ఇరుక్కుపోయాడు . సినిమా ప్రమోషన్స్ కోసం తన లైఫ్ ని చిక్కుల్లో పడేలా చేసుకున్నాడు అంటున్నారు జనాలు..!