మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.. సొంత అన్నే తనని చంపాలని చూస్తున్నాడంటూ ఫిర్యాదు.?

Pandrala Sravanthi
మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు భగ్గుమన్నాయి.. కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న ఈ ఫ్యామిలీలో మళ్లీ గొడవలు తెరమీదకి వచ్చాయి. మరి ఇంతకీ మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవరిపై ఫిర్యాదు చేశారు.. ఆయన్ని నిజంగానే చంపాలని చూస్తున్నారా.. ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మంచు ఫ్యామిలీలో రోజురోజుకు గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. మంచు మనోజ్ ఇప్పటికే పలుమార్లు మంచు విష్ణు నుండి తనకు ప్రాణాపాయం ఉందని, తనని తన ఫ్యామిలీని చంపాలని చూస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు పై మంచు మనోజ్ తల్లి నిర్మాలా దేవి ఖండించింది.. మనోజ్ చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదని, జనరేటర్ లో విష్ణు షుగర్ పోయలేదని,మనోజ్ అన్ని అవాస్తవాలే  చెబుతున్నాడని, విష్ణు మా ఇంటికి వచ్చి నాతో కేక్ కట్ చేయించి మళ్లీ తన వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు. 

కానీ మనోజ్ మాత్రం అబద్ధాలు చెప్తున్నాడు అంటూ సొంత కొడుకు పైనే నిర్మలాదేవి ఒక లేఖ విడుదల చేసింది. దీంతో మనోజ్ నిజస్వరూపం బయటపడింది.అయితే తాజాగా మంచు మనోజ్ మరొకసారి తన అన్న మంచు విష్ణుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడమే కాదు దాదాపు ఏడు పేజీల లేఖలో తన ఫిర్యాదు రాశారు.. మంచు విష్ణు వల్ల తనకి ప్రాణాపాయం ఉందని, మంచు విష్ణు తన ఫ్యామిలీని తనని చంపించాలని చూస్తున్నారంటూ కేసు పెట్టాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ విభేదాలు మీడియాలో సంచలనం సృష్టించాయి. 

అయితే పదేపదే మంచు మనోజ్ విష్ణు పై ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు కానీ కొంతమంది మంచు మనోజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం మనోజ్ కూడా లేకపోతే ఆస్తి మొత్తం తనదే అవుతుంది అని విష్ణు ఆలోచిస్తున్నాడు కావచ్చు.అందుకే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. ఇక మరి కొంతమందేమో మనోజ్ పూర్తిగా తన భార్య మాయలో పడిపోయాడు. అందుకే తన భార్య ఏం చెబితే అదే చేస్తున్నాడు. ఆస్తి కావాలి అని డైరెక్ట్ గా అడగకుండా ఇలా లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నాడు అంటూ మనోజ్ పై మండిపడుతున్నారు. కానీ వీరిరువురు చెప్పే దాంట్లో ఎవరిది నిజమో మాత్రం తెలియట్లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: