హమ్మయ్య..ఫైనల్లీ రాంచరణ్ నోరు విప్పాడుగా.. ఏమన్నారంటే..?

Thota Jaya Madhuri
పుష్ప 2.. పుష్ప 2.. పుష్ప 2..పుష్ప 2 సినిమా ఎలా అల్లు అర్జున్ లీఫ్ ని టర్న్ చేసిందో అందరికీ తెలిసిందే . అయితే ఆయన కెరీర్ ని మలుపు తిప్పడం కన్నా కూడా ఆయన లైఫ్ ని తలకిందులుగా చేసేసిందే అని అంటున్నారు జనాలు . దానికి కారణం అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం మధ్యాంతర బెయిల్ పై బయటకు రావడం . ఈ విషయాలంతా మనకి తెలిసిందే . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే మళ్లీ అల్లు అర్జున్ అరెస్టు కాబోతున్నాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.


తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ ని పక్కాగా లీగల్ గా ఎదుర్కోవడానికి మొత్తం రెడీ చేసుకుంది అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్ పేరు కూడా హైలెట్గా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు . రామ్ చరణ్ కోసం సుకుమార్ కూడా అమెరికా వెళ్ళాడు . ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనదైన స్టైల్ లో అదరగొట్టేసాడు . రామ్ చరణ్ కూడా సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగిడేసాడు .


సుకుమార్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని ..రంగస్థలం - పుష్ప2 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు అంటూ సుకుమార్ ని పొగిడే క్రమంలో పుష్ప2 అంటూ తన నోటి నుంచి చెప్పాడు. అయితే పుష్ప2 ని పర్సనల్ గా ఎక్కడ పొగడలేదు కానీ ఎప్పుడెప్పుడు రాంచరణ్ పుష్ప2 గురించి మాట్లాడుతాడా..? అంటూ ఫ్యాన్ ఈగర్ గా వెయిట్ చేసారు . ఫైనల్లీ పుష్ప2 అన్న పదం ఆయన నోటి నుండి వచ్చింది. అదే బ్రహ్మాండం అంటూ జనాలు బాగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: