టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరస పెట్టి విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం వరకు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య ఆ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.
పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా బాలయ్య "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పక్కా ప్లానింగ్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 2 వ తేదీన ఈ మూవీ బృందం వారు హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను చేయబోతున్నట్లు , ఆ తర్వాత జనవరి 4 వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఓ సాంగ్ ను యూఎస్ఏ లో విడుదల చేయబోతున్నట్లు , ఆ తర్వాత జనవరి 8 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లేదా మంగళగిరి ప్రాంతాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికిఎకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.