గేమ్ ఛేంజర్ లో ఓజీ మ్యానియా !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఉపముఖ్య మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన నుండి సినిమాలు రావాలని అభిమానులు ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ అభిమానుల దృష్టి అంతా ఆయన నటిస్తున్న ‘ఓజీ’ మూవీ పై ఉంది. దర్శకుడు సుజిత్ నేతృత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.



లేటెస్ట్ గా అమెరికాలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా అహిమానులు చాలామంది ‘ఓజీ’ నామస్మరణ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో ఈమూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఈమధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అనేకమంది నోటి వెంట ‘ఓజీ ఓజీ’ అంటూ నామస్మరణ జరిగినట్లు తెలుస్తోంది.



అనుకోని విధంగా రకరకాల కారణాలతో ‘ఓజీ’ విడుదల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ‘ఓజీ’ మూవీ మ్యానియా పవన్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులలో కూడ ఎక్కువగా కనిపిస్తోంది. ఈమధ్య అమెరికాలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్, తమన్ లకు కూడ ఎదురు కావడంతో రామ్ చరణ్ తెలివిగా ‘ఓజీ’ వ్యవహారం పై తెలివిగా స్పందియించినట్లు వార్తలు వస్తున్నాయి.



తన సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఈ సంక్రాంతికి విడుదలకాకపోతే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఏదోవిధంగా ఒప్పించి ‘ఓజీ’ మూవీ రాబోతున్న సంక్రాంతికి విడుదల అయ్యే విధంగా చూసేవాడిని అంటూ చరణ్ నోటివెంట ఆమాటలు రాగానే ఆకార్యక్రమానికి వచ్చిన మెగా అభిమానులు అంతా ‘ఓజీ ఓజీ’ అంటూ అరుపులు అరవడంతో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ లో ‘ఓజీ మ్యానియా’ కనిపించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు తమన్ కూడ ‘ఓజీ’ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ చేసిన కామెంట్స్ కు పవన్ అభిమానులు మరింత ఖుషీలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది..      



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: