అల్లు అర్జున్ కి అంత హెడ్ వెయిటా..? రేవతి చనిపోతే ఆ మాట అన్నాడా..

Thota Jaya Madhuri
గత కొన్ని రోజులకు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుని ఏ విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో జనాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడడానికి సంధ్య థియేటర్ కి రావడం వచ్చిన వ్యక్తి గమ్మునే సినిమా చూడకుండా రోడ్ షో లాంటి వి చేసి అక్కడ జనాలు ఆయనను చూడడానికి ఎగబడిపోవడం .. ఇదే తొక్కేసలాటలో రేవతి అనే మహిళ దారుణంగా మృతి చెందడం సంచలనంగా మారింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.


అయితే అల్లు అర్జున్ ఈ కేసుని చాలా సిల్లీ గా తీసుకున్నారు.  కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ కేసు ఆయన మెడకి చుట్టుకుంది.  ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చేలా చేసింది . నాంపల్లి కోర్టు ఆల్రెడీ 14 రోజుల రిమాండ్ విధించింది . కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది . కానీ ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పోలీసులపై సంచలన కామెంట్స్ చేయడం ఆయనపై ఇంకా నెగిటివిటీ పెరిగేలా చేసింది . అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త కూడా బయటకు వచ్చింది.  పోలీసులు వచ్చి బయట ఒక వ్యక్తి చనిపోయారు అని అల్లు అర్జున్ కి చెప్పినప్పుడు ఆయన నేను సినిమా చూశాక వెళ్తాను అని మొండిగా కూర్చున్నారట .


అంతేకాదు పుష్ప2 సినిమా హిట్ అవ్వడానికి నరబలి కూడా జరిగింది అంటూ సరదాగా నవ్వుకున్నారట . నిజంగానే అల్లు అర్జున్ అలా అన్నాడో లేదో మాత్రం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు బాగా హైలైట్ చేస్తున్నారు బన్నీ హేటర్స్. దుర్మార్గుడు.. నాశనం అయిపోతావ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.  ఇదే కాదు బన్నీ పై రకరకాలుగా కొన్ని వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లబోతున్నాడు అని చిప్పకూడు తినబోతున్నాడు అని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: