తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వెంకట్ ప్రభు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలలో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఈయన కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమాను రూపొందించాడు.
ఈ మూవీ లో అరవింద స్వామి ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమా కంటే ముందు వెంకట్ ప్రభు "మానాడు" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అలా మానాడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ గురించి తాజాగా వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
వెంకట్ ప్రభు తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కస్టడీ మూవీ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణం ... ఆ మూవీ కోసం మొదట మేము అనుకున్న కథ వేరు. ఆ తర్వాత తీసింది వేరు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే వెంకట్ ప్రభు కొంత కాలం క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.