టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తాయి.. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ల హవా కొనసాగుతుంది..వారికీ టాలీవుడ్లో భారీగా డిమాండ్ పెరిగిపోతుంది.వారిలో కన్నడ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ కి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన అద్భుతమైన ట్యూన్స్ తో తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పిస్తున్నాడు..తెలుగులో అజనీష్ లోకనాథ్ చేసిన మొదటి సినిమా ‘విరూపాక్ష’ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను కార్తీక్ దండు అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..అయితే ఈ సినిమాకు అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోతుంది.. ముఖ్యంగా అజనీష్ అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది.. ఈ సినిమాతో అజనీష్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది..
టాలీవుడ్ లో అజనీష్ మ్యూజిక్ అందించిన రెండో సినిమా’మంగళవారం’.. “ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది..పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమాకు అజనీష్ అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ మాములుగా ఉండదు.. ఆ మ్యూజిక్ ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ వస్తాయి..సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి అజనీష్ అందించే మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి... ఈ రెండు సినిమాల్లో అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రశంసల వర్షం కురిసింది. థ్రిల్లర్ సినిమాలకి ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం అని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు..
ఈ ఏడాది అజనీష్ మ్యూజిక్ అందించిన ప్రశాంత్ నీల్ “భగీర”,విజయ్ సేతుపతి “ మహారాజ” వంటి సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి..ప్రస్తుతం అజనీష్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. రిషబ్ శెట్టి “కాంతారా చాప్టర్ 1” మూవీ అలాగే తెలుగులో సాయి ధరమ్ తేజ్ “సంబరాల ఏటి గట్టు”, అలాగే నాగచైతన్య, కార్తీదండు కాంబినేషన్ లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ కి అజనీష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.