సినిమాకు రాయితీలు తీసుకుని ఇప్పుడు రాళ్లెలా పుష్పా.. ఇది త‌ప్పు క‌దా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అందరూ కలిసి జనాన్ని బకరాలు చేయడం మామూలు అయిపోయింది. అన్ని బాగున్నప్పుడు రాజకీయ ... సినిమా నాయకులు పరస్పరం ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తు కుంటారు. తేడాలు వస్తే మాత్రం పరస్పరం అమలు చేసుకుంటారు. విమర్శలు చేసుకుంటూ ఉంటారు. సినిమాతో పాటు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్ర‌మంలో నే కొన్ని ప్ర‌శ్న‌లు కూడా బ‌న్నీ కి వేస్తున్నారు. పుష్ప 2 సినిమా కు టాలీవుడ్ చ‌రిత్ర లోనే క‌నివినీ ఎరుగ‌ని రేంజ్ లో ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ లోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. అస‌లు ముందు రోజు సెకండ్ షో నుంచే ప్ర‌త్యేక ప్రీమియ‌ర్లు వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు అర్ధ‌రాత్రి షో ల‌తో పాటు తెల్ల‌వారు ఝాము నుంచే 6 షోల‌కు అనుమ‌తు లు ఇచ్చారు. ఇక ప్రీమియ‌ర్ షో టిక్కెట్ రేట్లు అయితే మ‌ల్టీ ఫ్లెక్స్ ల‌లో ఏకంగా రు. 1250 వ‌ర‌కు ప‌లికాయి. అస‌లు సింగిల్ స్క్రీన్ ల రేట్లు కూడా ఏకంగా రు. 800 దాటేశాయి.

ఈ రేంజ్ లో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులు బాటు ఇవ్వ‌డంతో నే పుష్ప 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్ల ప‌రంగా వీర కుమ్ముడు కుమ్మి ప‌డేసింది. ఇంత చేసినా కూడా సంథ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత ఇప్పుడు బ‌న్నీ ని ఎంత మంది విమ‌ర్శిస్తున్నారో .. అటు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూడా చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇది క‌రెక్ట్ కాదు క‌దా పుష్పా అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: