టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు . ఈయన ఆర్య అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా వరకు సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. కొంత కాలం క్రితం సుకుమార్ "పుష్ప పార్ట్ 1" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సుకుమార్ తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ ని రూపొందించాడు.
ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ మూవీ ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ హోల్డ్ ను కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా డల్లాస్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఆ ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుకుమార్ ను మీరు ఇప్పటినుండి దేనినైనా వదిలెయ్యాలి అంటే దేన్నీ వదిలేస్తారు అనే ప్రశ్నను అడిగింది. దానితో సుకుమార్ నాకు సినిమాలు వదిలేయాలి అని ఉంది అన్నాడు. దానితో పక్కనే ఉన్న చరణ్ అది క్యాన్సల్ అలా చేయకూడదు అంటూ అన్నాడు. ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.