ఎన్టీఆర్ విషయంలో మండిపడుతున్న హీరోయిన్.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మాధవి లతా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నచ్చావులే సినిమాలో తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా మాధవిలత  చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు  వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ మధ్యకాలంలో హీరోల అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో ముందుంటున్నారు. మరొకవైపు కష్టం వస్తే ఆదుకుంటారని, తమ అభిమాన హీరో వస్తాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా.. అయితే తమకు కష్టం వస్తే అభిమాన హీరో సహాయం చేస్తాడా? లేదా? అనే విషయం పక్కన పెడితే,ఒకవేళ హీరో మరిచిపోయి ,సహాయం చేయకపోతే అభిమానులు పెద్దగా పట్టించుకోరు కానీ పక్క వారు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఆ హీరో సహాయం చేయలేదని, సహాయం చేస్తానని మాట ఇచ్చి తప్పాడు అని రకరకాల కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్విమర్శలు ఎదుర్కొంటున్నారు. 
కౌశిక్ అనే క్యాన్సర్ బారిన పడిన యువకుడికి సహాయం చేస్తానని చెప్పి, ఇప్పుడు మాట తప్పాడని బాధిత యువకుడి తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. 

అయితే పెద్ద ఎత్తున ఈ విషయాలు వైరల్ గా మారడంతో ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవి లత  స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.మాధవీలత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రెస్పాండ్ అయ్యారు. తీవ్రంగా మండిపడ్డారు. అలా అభిమానులకు హీరోలు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినాలని అభిప్రాయపడ్డారు. ఆశించే వాళ్లు ఫ్యాన్స్ ఎలా అవుతారని ప్రశ్నించారు.సరస్వతి మాట్లాడిన వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.ఐతే ఏం చేద్దాం ఫ్యాన్స్ కు డబ్బులిస్తూ పోతే రోడ్ పై అడక్కు తింటారు హీరోస్అభిమాని అంటే ఆశించేవాడు కాదు అందుకే అభిమాని అంటారు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం, ఆశిస్తే స్వార్థం అవుద్ది,అభిమానం ఎలా అవుద్ది అని క్వశ్చన్ చేశారు.అయితే ఇంకా రోజుకొకరు బయటకు వస్తారు స్టోరీస్ పట్టుకుని ఫిల్మ్ నగర్ లో చాలా మంది తిరుగుతారు.. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది అని అన్నారు. ఇప్పుడు మాధవీలత పోస్ట్.. వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు యాంటీగా మాట్లాడుతున్నారు. అలా ఆర్థిక సహాయం విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: