"సై" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వాళ్ల కోసమే నితిన్ ప్రయత్నమా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "సై" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక నితిన్ హీరోగా రూపొందిన "సై" మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలలో రాబిన్ హుడ్ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇలా తన కొత్త సినిమా అనౌన్స్ అయ్యి పోస్ట్ పోన్ అయినా కూడా తన పాత సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి నితిన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: