మరోసారి సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా చాలా రోజుల నుంచి ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే విధంగా సుకుమార్ తీర్చిదిద్దారు. అల్లు అర్జున్ కూడా అద్భుతంగా నటించాడు. రష్మిక మందన తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా సక్సెస్ ను అల్లు అర్జున్ ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.
రోజు రోజుకు ఏదో ఒక ట్విస్టులు అల్లు అర్జున్ కు ఎదురవుతూనే ఉన్నాయి. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షోని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నిర్వహించిన కారణంగా అక్కడికి అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చాడు. దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మృతి చెందగా తన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు.

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తనవంతుగా రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడు. రేవతి కుమారుడి వైద్య చికిత్సకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అల్లు అర్జున్ ఏర్పరిచాడు. కానీ రేవతి మృతి పట్ల అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం కూడా గడిపి, బెయిల్ మీద బయటకు వచ్చారు. అల్లు అర్జున్ కు బెయిల్ క్యాన్సిల్ చేయాలని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఈ రోజు పోలీస్ స్టేషన్ కు హాజరుకానున్నాడు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరుకానున్నాడు. ఈ నేపథ్యంలో సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు మరోసారి రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న ఇచ్చిన నోటీసులలో  పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పట్ల మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: