పుష్ప-2 క్లైమాక్స్ ఫైట్.. రిహార్సల్స్ వీడియో వైరల్?
ఆ సంగతులు కాస్త పక్కన పెడితే, పుష్ప సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ 15 రోజులు పాటు 15 కోట్లకు పైనే ఖర్చు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే స్థాయిలో ఈ ఫైట్ వెండితెర పైన అదిరిపోయిందని సినిమా విడుదలైన తర్వాత టాక్ రూపంలో జనాలకు వినబడింది. ఇక విషయంలోకి వెళితే... ఈ ఫైట్ కి సంబంధించి ఫైట్ మాస్టర్ మరియు జూనియర్ ఫైటర్స్ రిహార్సల్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. చిత్ర యూనిట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.... అల్లు అభిమానులు సదరు వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియజేయడం విశేషం. ఫైటర్స్ కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పుష్ప పార్ట్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 1700 కోట్లకు పైనే కలెక్షన్లు రాబడుతున్నట్టు సమాచారం. మరి ముఖ్యంగా, ఒక్క హిందీలోనే ఈ సినిమా దాదాపు 1,000 కోట్లు రూపాయలు కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే, ఈ సినిమా అనేక వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం ప్రస్తుతం సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు నేడు హీరో అల్లు అర్జున్ ని విచారించనున్నారు.