పుష్ప 2: ఫీలింగ్స్ పాటకి దుమ్ము దులిపేస్తున్న మహిళా ప్రొఫెసర్.. స్టెప్పులకి ఫ్యాన్స్ ఫిదా..!
ముఖ్యంగా ఫీలింగ్స్ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ పాటకు ఇప్పుడు ప్రముఖ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ సైతం స్టెప్పులు వేయడంతో సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో కొచ్చిన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ డిపార్ట్మెంట్లో హెడ్ గా ఉన్న ఒక మహిళ పుష్ప 2 ఫీలింగ్స్ పాటకు డాన్స్ వేయడంతో పాటు విద్యార్థులకు కూడా ఆమె చుట్టూ కలిసి స్టెప్పులు వేశారు. అయితే ఈ మహిళ ప్రొఫెసర్ ఎనర్జీటీకి పలువురు నెటిజన్స్ కితాభిస్తూ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లక్షలాది మంది వీక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ మహిళా ప్రొఫెసర్ మైక్రో బయాలజీ సబ్జెక్టులో బోధిస్తున్నట్లు సమాచారం. ఫీలింగ్స్ పాటకు డ్యాన్సులు వేస్తున్న విద్యార్థులను చూసి మహిళా ప్రొఫెసర్ కూడా తన చేతిలో ఉండే పర్సనల్ సైతం దగ్గరలో ఉండే కుర్చీలో పెట్టి వారితో పాటు స్టెప్ వేయడం మరింత హైలెట్గా నిలిచింది.అయితే విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకే డాన్స్ చేసినట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఒక వైరల్ గా మారుతున్నది.